Balakrishna: బాలయ్య దురుసు ప్రవర్తన విమర్శలపై స్పందించిన అంజలి.. వీడియో షేర్ చేసిన నటి

Balakrishna garu and I have always maintained mutual respect says Anjali
  • ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా బాలకృష్ణ
  • ఫొటో సెషన్‌లో అంజలిని బాలయ్య తోసేశారంటూ వీడియో వైరల్
  • తమ మధ్య చాలా కాలంగా స్నేహం ఉందన్న అంజలి
  • ఆయనతో వేదిక పంచుకున్నందుకు ఆనందంగా ఉందన్న నటి
  • వీడియోకు ముందు, వెనక చూపించకుండా ఇదేంపనంటూ నిర్మాత నాగవంశీ ఫైర్
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ.. నటి అంజలితో దురుసుగా ప్రవర్తించారని, ఫొటోలకు పోజిచ్చే సమయంలో అంజలిని వెనక్కి నెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. దీంతో బాలయ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

తాజాగా, ఈ వివాదంపై అంజలి స్పందించారు. ‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ గారు వచ్చినందుకు కృతజ్ఞతలు. మా ఇద్దరి మధ్య చాలాకాలంగా ఫ్రెండ్‌షిప్ ఉంది. మేమిద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఆయనతో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఎక్స్‌‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా అదే వేడుకలో బాలయ్యకు, తనకు మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

మరి ఆ దృశ్యాన్ని ఎందుకు చూపలేదు
అంజలి విషయంలో బాలయ్య దురుసుగా ప్రవర్తించారన్న విమర్శలపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. ఫొటోలకు పోజిచ్చే సమయంలో చనువుకొద్దీ అలా వెనక్కి జరగమని తోశారని, నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు పరిచయం, చనువు కొద్దీ ఎవరైనా అలానే చేస్తారని చెప్పారు. వైరల్ అవుతున్న వీడియోకు ముందు, వెనక ఉన్న వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఆ తర్వాత బాలయ్య, అంజలి హైఫై అంటూ చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని మండిపడ్డారు.
Balakrishna
Anjali
Gangs of Godavari
Tollywood

More Telugu News