Rajinikanth: హిమాలయాల బాట పట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్

Rajinikanth Flies To Himalayas For A Spiritual Retreat
  • చెన్నై నుంచి డెహ్రాడూన్ చేరుకున్న సూపర్ స్టార్
  • ప్రతి సంవత్సరంలా ఆధ్యాత్మిక యాత్రకు వెళుతున్నట్లు వెల్లడి
  • తన ప్రయాణంలో ప్రతిసారి కొత్త అనుభూతిని పొందుతున్నానన్న రజనీ 
సూపర్‌స్టార్ రజనీకాంత్ హిమాలయాల బాట పట్టారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఏటా ఆయన హిమాలయాలకు వెళుతుంటారు. ఉత్తరాఖండ్ మీదుగా హిమాలయాలకు వెళ్లడానికి ఆయన చెన్నై నుంచి విమానంలో బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆయన డెహ్రాడూన్ విమానాశ్రయంలో, ఏఎన్ఐతో తన ఆధ్యాత్మిక ట్రిప్ గురించి స్పందించారు.

ప్రతి సంవత్సరంలా ఆధ్యాత్మిక యాత్రకు వెళుతున్నట్లు చెప్పారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నానన్నారు. ఈసారి కూడా కొత్త అనుభవాలు ఉంటాయని భావిస్తున్నానని రజనీకాంత్ అన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మక భావం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాలను సందర్శించనున్నట్లు చెప్పారు. రజనీకాంత్ ఇటీవల అబుదాబీలోని బీఏపీఎస్ హిందూ మందిర్‌ను సందర్శించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Rajinikanth
Himalayas

More Telugu News