AB Venkateshwara Rao: ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు హైకోర్టులో భారీ ఊర‌ట‌

Big Relief to AB Venkateshwara Rao in AP High Court
  • వెంకటేశ్వరరావుపై సస్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ ఇటీవ‌ల 'క్యాట్' ఉత్త‌ర్వులు
  • ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్
  • 'క్యాట్' ఉత్త‌ర్వుల‌ను స‌స్పెండ్ చేసేందుకు న్యాయ‌స్థానం నిరాక‌రణ‌
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట ల‌భించింది. క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఉత్త‌ర్వుల‌ను స‌స్పెండ్ చేసేందుకు ఉన్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ ఇటీవ‌ల క్యాట్ ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. క్యాట్ ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేసేందుకు నిరాక‌రించింది.
AB Venkateshwara Rao
AP High Court
Andhra Pradesh

More Telugu News