Hyderabad: ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య

Hyderabadi woman ends self following boyfriend betrayal
  • హైదరాబాదులోని జీడిమెట్లలో ఘటన 
  • యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ యువకుడు 
  • పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మాటతప్పిన వైనం
  • మోసం తట్టుకోలేక యువతి ఆత్మహథ్య 
  • తల్లిదండ్రుల మాట వినుంటే బాగుండేదంటూ 14 పేజీల సూసైడ్ నోట్
ప్రేమికుడి మోసం తట్టుకోలేక హైదరాబాద్ కు చెందిన ఓ యువతి తనవు చాలించింది. తల్లిదండ్రుల మాటలు వినుంటే ఈ రోజు సంతోషంగా ఉండేదాన్నంటూ 14 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల ఎస్సై ముంత ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, ఠాణా పరిధిలోని ఎన్‌ఎల్‌బీ నగర్‌లో నివాసముండే బాలబోయిన అఖిల (22) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేది. షాపుర్‌నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్‌ గత కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో అఖిలను వేధించేవాడు. ఆమె ఒప్పుకునే వరకూ వెంటపడ్డాడు. 

ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతడిని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతడి ప్రేమను ఒప్పుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాఫీగా సాగింది. గత మూడు, నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న విషయాలకు రోడ్డుపైనే అఖిలను కొడుతుండేవాడు. దీనికి తోడు అతడు పెళ్లికి నిరాకరించడంతో తన కుమార్తె మంగళవారం 14 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Hyderabad
Telangana
Crime News

More Telugu News