ఢిల్లీలో నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా: అధికారులకు మంత్రి ఆదేశాలు

నీటి సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత, పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కీలక చర్యలకు ఉపక్రమించింది. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ పేర్కొన్నారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకోసం ఢిల్లీలో 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ఆమె జల్ బోర్డు సీఈవోకు లేఖ రాశారు. హర్యానా నుంచి ఢిల్లీకి నీరు రావాల్సి ఉందని... ఈ నీటి కోసం అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని అతిశీ నిన్న తెలిపారు.

Atishi
New Delhi
Water

More Telugu News