Yashasvi Jaiswa: న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొట్టిన జైస్వాల్‌.. ఫొటోపై సూర్య స్వీట్ వార్నింగ్‌!

Suryakumar Yadav pokes fun at Yashasvi Jaiswal Instagram post
  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం న్యూయార్క్ చేరుకున్న టీమిండియా 
  • నెట్స్‌లో భార‌త ఆట‌గాళ్ల‌ తీవ్ర కసరత్తులు 
  • ప్రాక్టీస్ మధ్యలో కొంత విరామం దొర‌క‌డంతో న్యూయార్క్‌ వీధుల్లో చక్కర్లు
  • న్యూయార్క్ వీధుల్లో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన జైస్వాల్
  • యశస్వి పోస్టుపై ఫ‌న్నీగా స్పందించిన‌ సూర్య‌కుమార్
అమెరికా, విండీస్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఓ వైపు మేనేజ్‌మెంట్‌ ప్రారంభ‌ మ్యాచ్ కోసం అన్ని రెడీ చేస్తుండగా, ప్లేయర్లు కూడా వేదికకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే టీమిండియా కూడా ఇప్పటికే అమెరికా చేరింది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. అంతకంటే ముందు జూన్ 1వ తారీఖున‌ రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో ఒక వార్మప్ మ్యాచ్ ఆడ‌నుంది. దీంతో మన క్రికెటర్లు ప్ర‌స్తుతం నెట్స్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. 

అయితే,  ప్రాక్టీస్ మధ్యలో కొంత విరామం దొర‌క‌డంతో కొందరు ఆట‌గాళ్లు అలా న్యూయార్క్‌ వీధుల్లో కాసేపు చక్కర్లు కొట్టారు. తాజాగా యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్ కూడా సరదగా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దానికి సంబంధించిన ఫొటోలను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. దీంతో ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. 

ఈ క్ర‌మంలో యశస్వి పోస్టుపై టీ20 వ‌ర‌ల్డ్ నం.01 బ్యాట‌ర్ సూర్యకుమార్‌ యాదవ్ ఫన్నీగా స్పందించాడు. 'జాగ్రత్త. మీరు తోటల్లో తిరిగితే ఏమవుతుందో తెలుసుగా?' అంటూ కామెంట్ చేశాడు. దానికి న‌వ్వుతున్న ఎమోజీని జోడించాడు. ఇంగ్లాండ్‌, భారత్ రెండో టెస్టు సందర్భంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ సూర్య‌ అలా సరదాగా కామెంట్ చేశాడు. 'తోటల్లో తిరుగుతున్నట్లు తెలిస్తే' అంటూ అప్పట్లో రోహిత్ అన్న మాటలు నెట్టింట ఎంత వైరల‌య్యాయో అందరికీ తెలిసిందే.
Yashasvi Jaiswa
Suryakumar Yadav
Instagram
T20 World Cup 2024
Cricket
Team India
Sports News

More Telugu News