K Kavitha: మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఛార్జిషీట్... పరిగణనలోకి తీసుకున్న కోర్టు

Delhi liquor case hearings on June 3

  • జూన్ 3న విచారణకు హాజరు కావాలని కవిత, మరో నలుగురికి సమన్లు
  • గోవా ఎన్నికల సమయంలో ఏఏపీ తరఫున ప్రచారం చేసిన నలుగురి పేర్ల ప్రస్తావన
  • మద్యం పాలసీ కేసులో గోవాకు డబ్బు ఎలా చేరిందో ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఈడీ

ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జిషీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.

గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేసిన దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్‌లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో అన్ని వివరాలు వెల్లడించారు. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఈడీ పేర్కొంది.

More Telugu News