Pakistan Leader: మోదీ ఓడిపోవాలి.. పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వ్యాఖ్య

Modi needs to be defeated Says Pakistan Former Minister Fawad Chaudhry
  • రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు
  • పాకిస్థాన్ నుంచి విపక్ష నేతలకు మద్దతుపై మంగళవారం ప్రధాని విమర్శలు
  • ప్రధాని ఆందోళన వెలిబుచ్చిన మరుసటి రోజే పాక్ మాజీ మంత్రి స్పందన
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని వ్యాఖ్యానించారు. మోదీతో పాటు ఆయన భావజాలం కూడా ఓటమి పాలవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈమేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫవాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీని ఓడించేది ఎవరైనా కానివ్వండి.. అది రాహుల్ గాంధీ అయినా లేక అరవింద్ కేజ్రీవాల్ అయినా లేక మమతా బెనర్జీ అయినా.. ఎవరైనా సరే వారికి శుభాకాంక్షలు అంటూ ఫవాద్ వ్యాఖ్యానించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా ఫవాద్ చౌదరి గతంలోనూ పలుమార్లు కామెంట్స్ చేశారు. దీనిపై మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దాయాది దేశం నుంచి మన దేశంలోని రాజకీయ నేతలకు మద్దతు లభించడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఫవాద్ మరోసారి రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
Pakistan Leader
Fawad Choudary
Narendra Modi
Rahul Gandhi
Arvind Kejriwal
Mamata Banerjee
Viral Videos

More Telugu News