మళ్లీ బరిలోకి దిగుతున్న గుణశేఖర్!
- సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తున్న గుణశేఖర్
- జానపద .. పౌరాణికాలకు ప్రాధాన్యత
- కొత్త ప్రాజెక్టుపై రేపు ప్రకటన
అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఆ స్థాయిలోనే నష్టాలను చూసింది. ఆ సినిమా మొదలుపెట్టేటప్పుడు సమంతకి ఉన్న క్రేజ్ లో, ఆ సినిమా పూర్తయ్యే సమయానికి మార్పు వచ్చింది. ఆ సినిమా దెబ్బతినడానికి అదొక కారణం అయింది. ఆ సినిమా విడుదల తరువాత గుణశేఖర్ మౌనంగా ఉండిపోయారు.
ఇంతకాలంగా గుణశేఖర్ అదే మౌనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సినిమాలను ఇష్టపడేవారు, కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎనౌన్స్ మెంట్ రేపు రానుంది. తమ బ్యానర్లో సినిమా ఎనౌన్స్ మెంట్ రేపు ఉదయం 11 గంటలకు రానుందని ఒక పోస్టర్ ను వదిలారు. ఇది ఏ జోనర్లో ఉంటుంది? .. ఎవరితో ఉంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే విషయం.