Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు

AP High Court reserves verdict on Pinnelli anticipatory bail plea
  • పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి
  • అడ్డుకున్న టీడీపీ ఏజెంటుపై హత్యాయత్నం ఆరోపణలపై కేసులు
  • ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిన్నెల్లి  పిటిషన్
  • రేపు పూర్తిస్థాయి తీర్పు!

పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు ఇప్పటికే ఊరట లభించింది. 

అయితే, ఈవీఎంను ధ్వంసం చేసే ప్రయత్నంలో తనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం చేసిన ఆరోపణలతో నమోదైన కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. 

ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవల పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు  పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పిన్నెల్లికి కూడా హైకోర్టు పలు షరతులు విధించింది. జూన్ 6వ తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలని, కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది.

  • Loading...

More Telugu News