Kajal Agarwal: రాజమౌళి .. కృష్ణవంశీ .. తేజ గురించి కాజల్ ఏమందంటే .. !

Kajal Interview
  • మూడు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న కాజల్ 
  • 65 సినిమాలు చేశానని వెల్లడి
  • ఆ దర్శకుల నుంచి ఎంతో నేర్చుకున్నానని వ్యాఖ్య 
  • ఆమె తాజా చిత్రంగా రానున్న 'సత్యభామ'  

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కాజల్ కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సత్యభామ' రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కాజల్ పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. 

'లక్ష్మీ కల్యాణం' సినిమాతో నన్ను తేజ గారు పరిచయం చేశారు. ఆ తరువాత 'నేనేరాజు నేనే మంత్రి' .. 'సీత' సినిమాలు చేశాను. డైరెక్టర్ గా ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే రాజమౌళి .. కృష్ణవంశీ గార్ల దర్శకత్వంలోను పనిచేశాను. అలాంటి దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమేనని చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పద్ధతి. ఈ ముగ్గురి నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను" అని అన్నారు. 

"ఇంతవరకూ తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కలుపుకుని 65 సినిమాలు చేశాను. పేక్షకుల అభిమానం వల్లనే ఇంత జర్నీ సాధ్యమైందని అనుకుంటున్నాను. ఇక 'సత్యభామ'లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేశాను. ఇలాంటి ఒక పాత్ర చేయడం ఇదే ఫస్టు టైమ్. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News