K Kavitha: క‌విత బెయిల్ పిటిష‌న్ల‌పై ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ రేప‌టికి వాయిదా

BRS MLC Kavitha Bail Petition Hearing Adjourned to Tuesday
  • సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ విచార‌ణ
  • త‌న పిటిష‌న్ల‌లో బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను స‌వాల్ చేసిన క‌విత‌
  • క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు తదుపరి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు. 

క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి ఆమె అరెస్టులో ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ట్టాన్ని ఉల్లంఘించాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈడీ, సీబీఐలు కౌంట‌ర్ అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేశాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తదుపరి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. 

కాగా, ఫ‌లితం ఎలా ఉన్నా వాద‌న‌లు చాలా బాగా ఉన్నాయ‌ని విక్ర‌మ్ చౌద‌రిని జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌లు కీల‌క విష‌యాల‌ను న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండ‌ర్ టేకింగ్ ఇచ్చింద‌ని.. క‌విత వేసిన రిట్ పిటిష‌న్ సుప్రీంలో పెండింగులో ఉండ‌డంతో విచార‌ణ ముందుకు సాగ‌డం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసింద‌ని తెలిపారు. తాము ఇచ్చిన అండ‌ర్ టేకింగ్ త‌దుప‌రి వాయిదా వ‌ర‌కే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు. 

సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండ‌గానే 41 (ఏ) ప్ర‌కారం స‌మ‌న్లు జారీ చేశార‌ని విక్ర‌మ్ చౌద‌రి గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 161 ప్ర‌కారం మొద‌ట నోటీసులు ఇచ్చిన‌వారు,  ఆ త‌ర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియ‌ద‌న్నారు. సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఈడీ బృందం క‌విత ఇంట్లో ఉంద‌ని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. 

అలాగే జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గానే క‌విత‌ను ప్ర‌శ్నించాలంటూ సీబీఐ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం అంగీక‌రించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి స‌మాచారం లేద‌ని చెప్పుకొచ్చారు. సీఆర్‌పీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం సీబీఐ ప్ర‌శ్నించాలంటే క‌విత వాద‌న కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత క‌నీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసింద‌న్నారు. రేపు మ‌ధ్యాహ్నం కౌంట‌ర్ వాద‌న‌లు వినిపిస్తామ‌ని న్యాయ‌స్థానానికి ఈడీ తెలిపింది.

  • Loading...

More Telugu News