NVSS Prabhakar: రేవంత్ రెడ్డి వారానికోసారి ఢిల్లీకి వెళుతున్నారు... ఆ విమానంలో కప్పాన్ని తరలిస్తున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

NVSS Prabhakar alleges Revanth Reddy using flight for money
  • ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేయాలని విజ్ఞప్తి
  • రాష్ట్రానికి సంపద తగ్గిపోతున్నప్పటికీ... మంత్రుల ఆదాయం మాత్రం పెరుగుతోందని వ్యాఖ్య
  • మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద సీఎం స్పందించాలని డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళుతున్నారని... కప్పాన్ని తరలించేందుకు తాను వెళ్లే విమానాన్ని ఉపయోగిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన విమానాన్ని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేయాలని కోరారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సంపద తగ్గిపోతోందని... కానీ మంత్రుల ఆదాయం, ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు, సేకరణలో నాడు బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
NVSS Prabhakar
BJP
Revanth Reddy
Congress
Telangana

More Telugu News