IPL Final: ఐపీఎల్ ఫైనల్: టాస్ గెలిచిన సన్ రైజర్స్... అభిమానులకు నచ్చేదే ఎంచుకుంది!

SRH won the toss and elected batting first in IPL final against KKR
  • ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ నేడే
  • చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ సమరం
  • సన్ రైజర్స్ హైదరాబాద్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ టైటిల్ సమరంలో కీలకమైన టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ టోర్నీలో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ తీసుకుని ఎంతటి  విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. అందుకే, ఇవాళ సన్ రైజర్స్ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకోవాలని అభిమానులు కోరుకున్నారు. వారు కోరుకున్నదే జరిగింది. 

టాస్ కాయిన్ ను కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఎగరవేయగా, సన్ రైజర్స్ సారథి పాట్ కమిన్స్ 'హెడ్స్' అని చెప్పాడు. ఆ కాయిన్ 'హెడ్స్' పడడంతో కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్టు తమ నిర్ణయాన్ని ప్రకటించాడు. 

గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగి  స్పిన్ తిప్పేసిన షాబాజ్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకున్నట్టు కమిన్స్ చెప్పాడు. అబ్దుల్ సమద్ ను జట్టు నుంచి తప్పిస్తున్నట్టు వెల్లడించాడు. అటు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు సారథి శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్...
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్ క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, టి.నటరాజన్.

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్లు...
ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్.

కోల్ కతా నైట్ రైడర్స్...
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్లు...
అనుకూల్ రాయ్, మనీశ్ పాండే, నితీశ్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాయిన్ రూథర్ ఫర్డ్.

  • Loading...

More Telugu News