Guinness Book: గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! ఇదిగో వీడియో

Romeo A 6 Foot 4 Bull Officially Recognised By Guinness As Worlds Tallest
  • 6 అడుగుల 4.5 అంగుళాల ఎత్తున్న హోల్ స్టీన్ జాతి ఎద్దు ఘనత
  • ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయిన ఎద్దుగా రికార్డు
  • 10 రోజుల వయసులోనే కబేళాకు.. కాపాడి జంతు సంరక్షణశాలకు తరలించిన ఓ వ్యక్తి
  • విరాళాలతో ఆ ఎద్దు ఆహార ఖర్చు భరిస్తూ పెంచుతున్న జంతు ప్రేమికురాలు

అమెరికాలోని ఓరెగావ్ రాష్ర్టంలో ఉన్న జంతు సంరక్షణశాలలో సేదతీరుతున్న రోమియో అనే ఆరేళ్ల హోల్ స్టీన్ జాతి ఎద్దు సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తు పెరిగి ఈ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు రోమియో తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే భారీ ఆకారంతో కనిపించినప్పటికీ రోమియో మృదు స్వభావి అని దాని యజమాని మిస్టీ మూర్ చెప్పింది. కాగా, రోమియో యాపిల్స్, అరటిపండ్లను ఇష్టంగా తింటుంది. రోజుకు 45 కేజీల గడ్డిని అలవోకగా లాగించేస్తుంది. రోమియో భారీ సైజు వల్ల సాధారణ వాహనాల్లో దీన్ని తరలించడం సాధ్యంకాదు. అందుకే ప్రత్యేక వాహనాల్లో ఆ ఎద్దును తరలిస్తారు.

రోమియోను వధించేందుకు కొందరు కబేళాకు తరలించినప్పుడు దాని వయసు కేవలం 10 రోజులని.. ఈ విషయం తెలిసి ఓ వ్యక్తి దాన్ని కాపాడాడని రోమియో వివరించింది. అమెరికా డెయిరీ పరిశ్రమలో రోమియో లాంటి ఎడ్లను కేవలం ఉప ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఆమె గిన్నిస్ నిర్వాహకులతో మాట్లాడుతూ తెలిపింది. ప్రస్తుతం బ్రతుకుపై ఆశకు చిహ్నంగా రోమియో జీవిస్తోందని చెప్పింది. దాని భారీ ఆకారంతోపాటు అందమైన రూపం, తెలివితేటలు రోమియో పేరుకు తగ్గట్లుగానే సరిపోయాయని పేర్కొంది. రోమియో తిండి ఖర్చు కోసం విరాళాలు సేకరిస్తుంటామని మిస్టీ మూర్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News