Actor Navdeep: రేవ్ పార్టీ అంటే ఏంటో వివరించిన సినీ నటుడు నవదీప్

Navdeep talks about bengaluru rave party
  • ‘లవ్ మౌళి’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా నవదీప్ 
  • ఇందులో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ 
  • ఈసారి రేవ్ పార్టీకి సంబంధించి ఫేక్ వార్తల్లో నవదీప్ పేరు వినిపించలేదన్న విలేకరి 
  • వార్తల్లో తాను లేకపోవడం కొందరికి నిరుత్సాహం కలిగించి ఉండొచ్చన్న నవదీప్

ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను హాజరు అయినట్టు ఫేక్ వార్తలు రాక కొందరు నిరుత్సాహపడి ఉంటారని సినీ నటుడు నవదీప్ అన్నారు. ‘ ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించడంలేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. 

నవదీప్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘లవ్ మౌళి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురైంది. ‘ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అని విలేకరి ప్రస్తావించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. రేవ్ పార్టీ అంటే రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News