Sixth Phase Polling: ఆరో దశ పోలింగ్: రాత్రి 7 గంటల సమయానికి పోలింగ్ శాతం ఎంతంటే...!

Sixth phase polling percentage likely increase
  • దేశంలో నేడు ఆరో దశ పోలింగ్
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్
  • రాత్రి 7 గంటల సమయానికి 59.06 శాతం పోలింగ్ నమోదు
  • పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం

దేశంలో నేడు ఆరో విడత పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ముగింపు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. 

కాగా, రాత్రి 7 గంటల సమయానికి 59.06 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. 

ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. దేశంలో ఈసారి 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుండగా... నేటితో 6 దశల పోలింగ్ పూర్తయింది. 

ఇప్పటివరకు 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. చివరిదైన ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈ విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News