Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో భారీ పేలుడు... 10 మందికి పైగా మృతి

blast at explosives factory in Chhattisgarh
  • బెమెతరా జిల్లాలోని పిర్దా గ్రామ సమీపంలో పేలుడు
  • ఘటనా స్థలికి పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్
  • గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలింపు

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది నుంచి 17 మంది వరకు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పిర్దా గ్రామ సమీపంలోని బెర్లా డెవలప్‌మెంట్ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది.

  • Loading...

More Telugu News