Chandrababu: మన రాష్ట్రం మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం ఆందోళనకరం: చంద్రబాబు

Chandrababu responds on human trafficking issue
  • కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాకు మానవ అక్రమ రవాణా
  • కాంబోడియా, భారత్ మధ్య అక్రమ రవాణా రాకెట్  నడుస్తోందన్న చంద్రబాబు
  • బాధితులతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఆగ్రహం
  • బాధితులను తీసుకువచ్చేందుకు సాయపడాలని కేంద్రమంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి

కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతకు వల వేసి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరం అని పేర్కొన్నారు. 

కాంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందని, ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారని చంద్రబాబు వివరించారు. వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించారని ఆరోపించారు. 

మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News