IPL Qualifier-2: ఐపీఎల్ క్వాలిఫయర్-2: సన్ రైజర్స్ కు బ్యాటింగ్... బౌల్ట్ దెబ్బకు 57 రన్స్ కే 3 వికెట్లు డౌన్

SRH lost three early wickets against RR in IPL Qualifier2
  • ఐపీఎల్ క్వాలిఫయర్-2లో సన్ రైజర్స్ × రాజస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్

ఐపీఎల్ 17వ సీజన్ ప్లేఆఫ్స్ లో భాగంగా నేడు క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతోంది.  ఫైనల్లో చోటు కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. 

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోగా, సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి సన్ రైజర్స్ 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 12 పరుగులకే అవుట్ అయ్యాడు. 

త్రిపాఠి 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 37 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఐడెన్ మార్ క్రమ్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కూడా బౌల్ట్ ఖాతాలోకే చేరింది.

ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ స్కోరు 7 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు కాగా... ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28, హెన్రిచ్ క్లాసెన్ 2 పరుగులతోనూ ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News