Dil Raju: బన్నీ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచించేవాడు: 'లవ్ మీ' ఈవెంటులో దిల్ రాజు

Love Me Pre Release Event
  • రేపు విడుదల కానున్న 'లవ్ మీ'
  • ఆశిష్ - వైష్ణవి జంటగా చేసిన సినిమా 
  • హీరో కాన్ఫిడెన్స్ ను మెచ్చుకున్న దిల్ రాజు 
  • ఆడియన్స్ మనసు గెలుచుకోవాలని వెల్లడి

దిల్ రాజు బ్యానర్లో .. ఆశిష్ - వైష్ణవీ చైతన్య జంటగా 'లవ్ మీ' సినిమా రూపొందింది. దెయ్యాన్ని ప్రేమిస్తే .. దెయ్యంతో రొమాన్స్ కి ట్రై చేస్తే .. అనే ఒక చిత్రమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. అందువలన ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి.  రేపే ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈ స్టేజ్ పై దిల్ రాజు మాట్లాడుతూ .. "ఈ సినిమా నిర్మాతలుగా హర్షిత్ - హన్సిత .. హీరోగా ఆశిష్ వీళ్లెవరూ ఏదో మేము ఉన్నాం కదా అని చెప్పి ఇండస్ట్రీలోకి రాలేదు. ముగ్గురూ కూడా చాలా ప్యాషన్ తో ఈ రంగంలోకి అడుగుపెట్టారు .. అందుకోసం ఎంతో కసరత్తు చేశారు. ఆశిష్ ఒక హీరోగా తనని తాను నిరూపించుకోవడం కోసం, ఐదేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. ఇంకా వాళ్లు ఎంతో కష్టపడవలసి ఉంటుంది" అని అన్నారు. 

"బన్నీని నేను చాలా దగ్గర నుంచి చూశాను. సినిమా తప్ప ఆయనకి మరో ఆలోచన ఉండేది కాదు. అలాగే ఆశిష్ కూడా 24 గంటలూ సినిమాను గురించి మాత్రమే ఆలోచించాలి. ఒక సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యేవరకూ పూర్తి ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే పనిగా పెట్టుకోవాలి" అంటూ ఆశిష్ ను ఉద్దేశించి మాట్లాడారు. 

  • Loading...

More Telugu News