Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ... డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు

CCB sents notices to rave party accused
  • నోటీసులు పంపించిన సీసీబీ
  • రేవ్ పార్టీ కేసులో ఏ1గా వాసు పేరు
  • సన్ సెట్ టు సన్ రైజ్ పేరుతో బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు
  • రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పలువురి రక్తనమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. అందులో తెలుగు నటి కూడా ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు పంపించింది. ఈ కేసులో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహమ్మద్ అబూబాకర్, ఏ6గా గోపాల్ రెడ్డి, ఏ7గా 68 మంది పురుషుల పేర్లు, ఏ8గా 30 మంది యువతుల పేర్లను పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి 14 గ్రాముల ఎండీఎం, 5 గ్రాముల కొకైన్, భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోటిన్నర రూపాయల విలువ చేసే డీజే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏ1 నిందితుడు వాసు సన్ సెట్ టు సన్ రైజ్ పేరుతో బర్త్ డే వేడుకలను నిర్వహించినట్లు చెప్పారు. ఈ రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొన్నారని... ఇందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. 

మరోవైపు, రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు పంపించింది. ఇప్పటికే పలువురిని విచారిస్తున్నారు. నటి హేమతో పాటు ఆషిరాయ్‌కి కూడా పాజిటివ్ వచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. హేమ కృష్ణవేణి పేరుతో ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ రికార్డుల్లోనూ అదే పేరు ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News