Kota Srinivasa Rao: అప్పుడు నా కళ్ళెంట నీళ్లొచ్చాయ్: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు

Kota Interview
  • తనదైన విలనిజంతో మెప్పించిన కోట 
  • జంధ్యాల .. బాపు .. రమణలను గుర్తుచేసుకున్న నటుడు
  • నిన్నటి హాస్యం తల్లిపాలలాంటిదని వెల్లడి 
  • నేటి కామెడీ డబ్బా పాలవంటిదని వ్యాఖ్య  

కోట శ్రీనివాసరావు .. దశాబ్దాల పాటు తనదైన విలనిజాన్ని తెరపై పరుగులు తీయించినవారాయన. అలాంటి కోట శ్రీనివాసరావు, కొంత కాలంగా అనారోగ్య కారణాల వలన సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక అంశాలను అభిమానులతో పంచుకున్నారు. 

"ఒకసారి నేను బాపు గారి సినిమాలో చేస్తున్నాను .. ఆ పక్కనే రమణగారు ఉన్నారు. నేను డైలాగ్ చెప్పలేకపోతున్నాను. నేను ఇబ్బందిపడుతుండటం చూసిన రమణగారు నన్ను పిలిచారు. నాతో పాటువచ్చి బాపుగారు కూడా అక్కడ కూర్చున్నారు. 'ఈ బాపుగారు .. నేను .. నీ ఫ్యాన్సయ్యా ' అని రమణగారు అన్నారు. ఆ మాటకి నాకు ఒక్క సారిగా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఆ తరువాత 'పద్మశ్రీ' వచ్చినంత ఆనందమేసింది'' అని అన్నారు. 

ఆ తరువాత బాపు - రమణ గారి గురించి ఒక సందర్భంలో నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడను? తెలుగు చూడాలంటే బాపు .. తెలుగు వినాలంటే రమణగారు అని అన్నాను. ఎవరైనా .. ఎప్పుడైనా .. ఎక్కడైనా .. ఏ వయసులో ఉన్నవారైనా చెప్పుకుని నవ్వుకునేలా ఉండేది హాస్యం. ఒకప్పుడున్నది హాస్యం .. ఇప్పుడున్నది కామెడీ. ఆనాటి హాస్యం తల్లిపాలలాంటిది .. ఇప్పుడున్న కామెడీ డబ్బాపాలవంటిది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News