Bus Accident: కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు.. ఇద్దరు పిల్లల దుర్మరణం

Two Kids dead in Bus Accident At Kodumuru
  • 35 మంది ప్రయాణికులకు గాయాలు
  • ప్రయాణికులను కాపాడిన గ్రామస్థులు
  • హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సు

హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కర్నూల్ – కోడుమూరు సమీపంలో బోల్తా పడింది. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలుపలికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ బస్సును క్రేన్ సాయంతో సరిచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News