Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు

AP Police look out notices on Pinnelli
  • పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో నోటీసులు
  • విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు
  • అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన ఏపీ పోలీసులు

మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు.

హైదరాబాద్‌లో పిన్నెల్లి కోసం తెలంగాణ పోలీసులతో కలిసి ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం సాగింది. కానీ అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ తర్వాత ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News