Swathi Maliwal: నా వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి: స్వాతి మాలివాల్

Investigation Intensifies In Swati Maliwal Assault Case
  • కొందరు పార్టీ నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • తనకు పార్టీ సీనియర్ నేత నుంచి నిన్న ఫోన్ వచ్చిందన్న స్వాతి మాలివాల్
  • తనపై ఆరోపణలు చేయాలని నేతలపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా చెప్పారని వెల్లడి

తన వ్యక్తిగత ఫొటోలు లీక్ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డారంటూ మాలివాల్ ఆరోపణలు చేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా, స్వాతి మాలివాల్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కొందరు పార్టీ నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఫొటోలు లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత నుంచి నిన్న తనకు ఫోన్ కాల్ వచ్చిందని... తనపై అభ్యంతకర ఆరోపణలు చేయాలని చెబుతూ పార్టీలో అందరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా ఆయన తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా చెప్పారన్నారు. తనకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు.

తనకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించే బాధ్యతలు కొందరికి, సోషల్ మీడియాలో ట్వీట్లు చేసే బాధ్యత ఇంకొందరికి అప్పగించినట్లుగా తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు.  కానీ, వేలమంది సైన్యాన్ని దింపినా తాను ఒంటరిగా ఎదుర్కొంటానని మాలివాల్ అన్నారు. నిజం తన వైపే ఉందన్నారు. తాను ఆత్మగౌరవ పోరాటం ప్రారంభించానని... న్యాయం జరిగే వరకు పోరాడుతానని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News