KTR: మానవత్వం చాటిన‌ కేటీఆర్.. ఇదిగో వీడియో!

BRS Leader KTR Help Man who Injured in Road Accident at Warangal Labour Colony
  • రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆసుప‌త్రికి తరలించిన కేటీఆర్ 
  • వ‌రంగ‌ల్ లేబ‌ర్ కాల‌నీ వ‌ద్ద ఘ‌ట‌న‌
  • యాక్సిడెంట్‌కు గురై రోడ్డుపై ప‌డిఉన్న అంజ‌య్య‌ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ్య‌క్తిని చికిత్స కోసం తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించిన ఉదంతమిది. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ లో చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్ర‌చారం కోసం వరంగల్ లేబర్ కాలనీ మార్గంలో వెళ్తున్న కేటీఆర్‌కు మార్గమధ్యంలో అంజయ్య (55) అనే వ్యక్తి రోడ్డు ప్ర‌మాదానికి గురై రోడ్డుపై కిందపడి ఉండ‌డం క‌నిపించింది. 

తీవ్ర గాయాల‌తో ఉన్న‌ అతన్ని చూసి కేటీఆర్‌ తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కుముందు కూడా ఇలాగే కేటీఆర్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌కు సాయం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News