Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లిపై తీసుకునే చర్యలు ఎలా ఉండాలంటే.. భవిష్యత్తులో ఎవరూ అలాంటి సాహసం చేయకూడదు: ఈసీకి నిమ్మగడ్డ ఫిర్యాదు

Nimmagadda Ramesh Kumar Complaints Against Pennelli
  • పిన్నెల్లి వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ
  • ఈవీఎంను పిన్నెల్లి పగలగొడుతున్న వీడియో అందజేత
  • కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

మాచర్లలోని ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంలను నేలకేసి పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిపై ‘ఎలక్షన్ వాచ్‘ కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోను ఈసీకి అందించారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి పనులకు సాహసించకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను నేలకేసి కొట్టి పగలగొట్టిన వీడియో నిన్న సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. నేడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో తనను ప్రశ్నించిన ఓ మహిళను వేలు చూపిస్తూ పిన్నెల్లి బెదిరించడం స్పష్టంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News