TDP Leaders: ఏపీలో వైద్యశాఖకు అనారోగ్యం: సోమిరెడ్డి

TDP Leaders Press Meet At Visakhapatnam
  • రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని ఆరోపణ
  • వైసీపీ నేతల మాదిరిగా తాను అవినీతికి పాల్పడలేదని వివరణ
  • జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుందన్న రఘురామకృష్ణరాజు
  • విశాఖపట్నంలో టీడీపీ నేతల మీడియా సమావేశం

ఆంధ్రప్రదేశ్ లో వైద్యశాఖకు సుస్తీ చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైద్యశాఖ మాత్రమే కాదు రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని విమర్శించారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. వారి (వైసీపీ నేతల) లాగా తాను అవినీతికి పాల్పడలేదని సోమిరెడ్డి చెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలకు నెల్లూరులో సమాధానం చెబుతానని తెలిపారు. ఈమేరకు బుధవారం విశాఖపట్నంలో సహచర నేతలతో కలిసి సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణరాజు మాట్లాడారు.

 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూటమినే వరిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మెజారిటీ సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు. టీడీపీకి చెందిన మరో నేత రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ఈవీఎం ధ్వంసంపై పిన్నెల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుందని జోస్యం చెప్పారు. వైసీపీ దారుణ పరాజయం మూటగట్టుకోనుందని చెప్పారు. సీఎం జగన్ కు బటన్ నొక్కడమే తెలుసు తప్ప బిల్లులు చెల్లించడం తెలియదని, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. సీఎస్ ను మారిస్తే రాష్ట్రంలో అన్నీ సర్దుకుంటాయని రఘురామకృష్ణరాజు చెప్పారు.

  • Loading...

More Telugu News