Kanakamedala Ravindra Kumar: వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా వారిపై కేసుల్లేవు: కనకమేడల

Kanakamedala alleges police does not file cases on YCP leaders
  • గత రెండేళ్లుగా మాచర్లలో వైసీపీ హింస కొనసాగుతోందన్న కనకమేడల
  • తప్పనిసరి పరిస్థితుల్లో నామమాత్రపు కేసులు పెట్టారని వెల్లడి
  • మాచర్లలో నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త గొంతు కోశారని ఆగ్రహం
గత రెండేళ్లుగా మాచర్లలో వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా వారిపై పోలీసు కేసులు నమోదు చేయడంలేదని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. తప్పనిసరి పరిస్థితులు వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆరోపించారు. 

రాష్ట్రంలో ఎన్నిలకు ముందే 100 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి చంపారని వివరించారు. సీఎస్ జవహర్ రెడ్డి, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయని కనకమేడల ఆరోపించారు. 

వైసీపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఘటనలు జరిగాయని అన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేయాలని, తద్వారా అసలు కుట్రదారులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Kanakamedala Ravindra Kumar
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News