MS Dhoni: రాంచీ వీధుల్లో బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో ఇదిగో!

MS Dhoni Out On Bike Ride In Ranchi Days After IPL Heartbreak
  • ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ కు చేరని సీఎస్కే
  • కీలక మ్యాచ్ లో క్యాచ్ ఔట్ అయిన ధోనీ
  • రాంచీ వెళ్లిపోయిన టీమిండియా మాజీ సారథి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్ లో అనూహ్య ఓటమితో సీఎస్కే ఐపీఎల్ ప్రయాణం ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ క్యాచ్ ఔట్ ఫలితాన్ని తారుమారు చేసింది. పెవిలియన్ కు వెళుతూ ధోనీ అసహనానికి గురవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్ ఓటమితో సీఎస్కే ఇంటికి చేరింది. దీంతో ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ప్రస్థానం కూడా ముగిసిందని, వచ్చే ఏడాది సీజన్ లో ధోనీ ఆడకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఓవైపు ఐపీఎల్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు, వచ్చే ఏడాది కూడా ఆడతాడని మరికొందరు సోషల్ మీడియ వేదికలపై చర్చించుకుంటుండగా.. మిస్టర్ కూల్ మాత్రం కూల్ గా తన బైక్ తో రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. రిటైర్మెంట్ పై ధోనీ స్పందించలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఓటమి తర్వాత ధోనీ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నాడు. తాజాగా తన బైక్ తో ధోనీ చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MS Dhoni
Bike Ride
Ranchi
IPL 2024
CSK

More Telugu News