Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ కు ప్రధాని మోదీ నివాళి

my tributes to our former PM Shri Rajiv Gandhi Ji says Modi
  • సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన వర్ధంతి రోజును గుర్తుచేసుకున్న మోదీ
  • 1991 మే 21న ఎల్ టీటీఈ తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో కన్నుమూసిన రాజీవ్ గాంధీ
దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈరోజు మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఆయనకు నా నివాళి’ అంటూ మోదీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

శ్రీలంకకు చెందిన ఎల్ టీటీఈ తీవ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురవడం తెలిసిందే. 1991 మే 21న తమిళనాడులోని  శ్రీ పెరంబుదూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ కన్నుమూశారు.
Rajiv Gandhi
Narendra Modi
Ex PM
Tribute
Death Anniversary

More Telugu News