ఎన్టీఆర్ కు విషెస్ తెలుపుతూ కొడాలి నాని పంచుకున్న ఫొటో మామూలుగా లేదు!
- నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
- గతంలో ఎన్టీఆర్ తో పలు చిత్రాలు నిర్మించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
- ఓ షూటింగ్ స్పాట్ లో ఎన్టీఆర్ తో నాని, వంశీ
- నానీపై కాలేసుకుని కూర్చున్న ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలినాళ్లలో ఓ సినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫొటో అది. అందులో కొడాలి నానిపై కాలేసుకుని కూర్చున్న ఎన్టీఆర్ ను చూడొచ్చు. ఇదే ఫొటోలో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.
గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో వారిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా బాగా దగ్గరయ్యారు. ఎన్టీఆర్ తో పలు చిత్రాలను కూడా నిర్మించారు.