Kodali Nani: ఎన్టీఆర్ కు విషెస్ తెలుపుతూ కొడాలి నాని పంచుకున్న ఫొటో మామూలుగా లేదు!

Kodali Nani shares very interesting photo on NTR birthday
  • నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
  • గతంలో ఎన్టీఆర్ తో పలు చిత్రాలు నిర్మించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
  • ఓ షూటింగ్ స్పాట్ లో ఎన్టీఆర్ తో నాని, వంశీ
  • నానీపై కాలేసుకుని కూర్చున్న ఎన్టీఆర్
ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు అన్ని వర్గాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా విషెస్ తెలిపారు. నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న ఫొటో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలినాళ్లలో ఓ సినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫొటో అది. అందులో కొడాలి నానిపై కాలేసుకుని కూర్చున్న ఎన్టీఆర్ ను చూడొచ్చు. ఇదే ఫొటోలో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.

గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణకు సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో వారిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా బాగా దగ్గరయ్యారు. ఎన్టీఆర్ తో పలు చిత్రాలను కూడా నిర్మించారు.
Kodali Nani
NTR
Birthday
Vallabhaneni Vamsi

More Telugu News