ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియజేసిన పవన్ కల్యాణ్

  • ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్
  • ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడన్న పవన్ 
  • మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్ష
టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ (మే 20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు జనసేనాని పవన్ కల్యాణ్ విషెస్ తెలియజేశారు. 

"ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Jr NTR
Birthday
Pawan Kalyan
Wishes
Young Tiger
Tollywood

More Telugu News