Ebrhami Raisi: ఇరాన్ అధ్యక్షుడి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

PM Modi shocked to know Iran President Ebrahim Raisi tragic demise
  • అధ్యక్షుడు రైసీ అజర్ బైజాన్ సరిహద్దుల నుంచి తిరిగివస్తుండగా కూలిపోయిన హెలికాప్టర్ 
  • భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతం కోసం రైసీ చేసిన కృషి చిరస్మరణీయమన్న మోదీ   
  • రైసీ కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు సానుభూతి తెలిపిన భారత ప్రధాని మోదీ

అజర్ బైజాన్ సరిహద్దుల నుంచి తిరిగివస్తూ, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విషాదకర రీతిలో మరణించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మోదీ పేర్కొన్నారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం రైసీ చేసిన కృషి చిరస్మరణీయం అని కొనియాడారు. 

"ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలుపుకుంటున్నాను. ఈ విచారకర సమయంలో ఇరాన్ కు భారత్ అండగా నిలుస్తుంది" అని మోదీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News