"దూకే ధైర్యమా... దేవర ముంగిట నువ్వెంత...!" ఎన్టీఆర్ 'దేవర' నుంచి 'ఫియర్ సాంగ్' ఇదిగో!

  • ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర
  • ఫియర్ సాంగ్ ను విడుదల చేసిన చిత్రబృందం
  • అనిరుధ్ రవిచందర్ సంగీతం... రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
  • ఫియర్ సాంగ్ ను స్వయంగా ఆలపించిన అనిరుధ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం దేవర. తాజాగా ఈ చిత్రం నుంచి ఫియర్ సాంగ్ రిలీజైంది. "దూకే  ధైర్యమా... జాగ్రత్త... రాకే, తెగబడి రాకే... దేవర ముంగిట నువ్వెంత" అంటూ సాగే ఈ పవర్ ఫుల్ గీతానికి అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వయంగా ఆలపించారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షీనే టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


More Telugu News

Fear Song Devara NTR Koratala Siva NTR Arts Yuvasudha ARts