SRH: ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్... నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Rachakonda police imposes traffic measures in the wake of SRH match
  • ఐపీఎల్ తాజా సీజన్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న ఎస్ఆర్ హెచ్
  • ఇప్పటికే ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించిన హైదరాబాద్ టీమ్
  • నేడు గెలిస్తే ప్లేఆఫ్స్ లో మెరుగైన స్థానం లభించే అవకాశం
ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను భగాయత్ రోడ్డుపై మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
SRH
PBKS
Uppal
Traffic
Rachakonda Police

More Telugu News