cow fight: కుమ్ముకుంటూ అమ్మాయిలపైకి దూసుకెళ్లి కిందపడేసిన ఆవులు.. వీడియో వైరల్

Fighting Cows Ram Into Girls On Delhi Streets Terrifying Video Goes Viral
  • ఢిల్లీలోని ఓ వీధిలో అనూహ్య ఘటన
  • కిందపడ్డ ఓ బాలికను గిట్టలతో తొక్కిన వైనం
  • ఆవులను చెదరగొట్టి పిల్లలను కాపాడిన స్థానికులు
ఎంత సాధుజీవులు అయినప్పటికీ ఆవుల్లోనూ జంతు ప్రవృత్తి ఉంటుందనే విషయం మళ్లీ నిరూపణ అయింది. ఢిల్లీలోని ఓ వీధిలో పట్టపగలే రెండు ఆవులు కుమ్ముకుంటూ షాప్ బయట కూర్చున్న ముగ్గురు అమ్మాయిలపైకి దూసుకెళ్లాయి.

షాప్ ముందున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం నెటిజన్లను అవాక్కు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయింది. ఈ వీడియోకు ఏకంగా 20 లక్షల వ్యూస్ లభించాయి.

ఆ వీడియోలో ముగ్గురు బాలికలు ఓ షాప్ బయట ఏదో తింటూ మాట్లాడుకుంటూ కనిపించారు. వారిలో ఇద్దరు కూర్చోగా మరో బాలిక నిలబడి ఉంది.

ఇంతలో హఠాత్తుగా రెండు ఆవులు కుమ్ముకుంటూ వారిపైకి దూసుకొచ్చాయి. దీంతో వారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. అయినా ఆవులు ఆగకుండా కుమ్ముకుంటూనే ఉన్నాయి.

కిందపడ్డ బాలికను ఒక ఆవు గిట్టలతో తొక్కుతుండటం కనిపించింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించారు. ఒకరు ఆవులను చెదరగొట్టగా మరొకరేమో కిందపడ్డ బాలికను పైకిలేపి పక్కకు తీసుకెళ్లారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సకాలంలో స్పందించిన యువకులను ప్రశంసించారు. అలాగే రోడ్లపై ఆవులు తిరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
cow fight
New Delhi
ram
into
girls

More Telugu News