Radhika: సీనియర్ నటి రాధికకు ఏమైంది?... వీడియో వైరల్!

What happened to Radhika

  • సోఫాలో కదల్లేని స్థితిలో రాధిక
  • పరామర్శించిన సీనియర్ నటుడు శివకుమార్
  • కాలికి చికిత్స చేయించుకుని కోలుకుంటున్నానని రాధిక వెల్లడి 

సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధిక సోఫాలో కదల్లేని స్థితిలో కాళ్లు చాపుకుని కూర్చుని ఓ ఆల్బం తిరగేస్తూ ఉండగా, మరో సీనియర్ నటుడు శివకుమార్ (హీరోలు సూర్య, కార్తీల తండ్రి) ఆమెను పరామర్శిస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను రాధిక తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. 

దీనిపై ఆమె స్పందిస్తూ... "శివకుమార్ అన్నతో నాది జీవితకాల అనుబంధం. కాలికి చికిత్స చేయించుకుని కోలుకుంటున్న నన్ను చూడ్డానికి శివకుమార్ అన్న వచ్చారు. మా ప్రస్థానానికి సంబంధించిన చిత్రాలు, ఫొటోల గురించి అనేక సంగతులు ముచ్చటించుకున్నాం" అంటూ వివరణ ఇచ్చారు.

Radhika
Actress
Sivakumar
Video
Kollywood
  • Loading...

More Telugu News