BRS: సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి

Peddi Sudarshan Reddy allees scam in rice tenders
  • తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారని విమర్శ
  • సన్నబియ్యం టెండర్లలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపణలు
  • ప్రభుత్వం రైస్ మిల్లర్లను వేధిస్తోందన్న బీఆర్ఎస్ నేత
సన్న బియ్యం టెండర్లలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారన్నారు. సన్నబియ్యం టెండర్లలో భారీ కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లను వేధిస్తోందన్నారు. ఢిల్లీకి, ముఖ్యమంత్రి పేషీకి మూటలు పంపించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
BRS
Congress

More Telugu News