Gottimukkala Sudhakar: తెనాలి ఎమ్మెల్యే-ఓటరు చెంపదెబ్బ వ్యవహారం: గుంటూరు ఎస్పీని కలిసిన గొట్టిముక్కల సుధాకర్

Gottimukkala Sudhakar met Guntur SP for protection
  • పోలింగ్ రోజున తెనాలిలో ఓటరు సుధాకర్, ఎమ్మెల్యే అన్నాబత్తుని మధ్య గొడవ
  • సుధాకర్ ను దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే అనుచరులు
  • వైసీపీ నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్న సుధాకర్

ఏపీలో పోలింగ్ రోజున తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ మధ్య చెంపదెబ్బ వ్యవహారం తెలిసిందే. 

క్యూలైన్ లో కాకుండా, నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా, ఓటరు సుధాకర్ అడ్డుకున్నారు. దాంతో సుధాకర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని చేయిచేసుకోగా, తిరిగి సుధాకర్ కూడా చెంపచెళ్లుమనిపించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్ పై దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్ కు గాయాలయ్యాయి. 

కాగా, గొట్టిముక్కల సుధాకర్ నేడు గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. కోర్టు ఆదేశాల మేరకు తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. తన కుటుంబ సభ్యులకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని తెలియజేశారు. 

గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడి తర్వాత ఎమ్మెల్యేపై కేసు పెట్టినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News