Japan: చీరకట్టులో జపనీయుల మది దోచిన యువతి.. వీడియో వైరల్!

Indian Woman Strolls Through Streets of Japan in Saree Leaves Locals Enthralled
  • చీరలో టోక్యో వీధుల్లో సరదాగా నడిచిన కంటెంట్ క్రియేటర్ మహి శర్మ
  • నోరెళ్లబెట్టి చూస్తుండిపోయిన జపనీయులు.. ఆమె ఫొటోలు తీసేందుకు పోటీపడ్డ కొందరు మహిళలు
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను పోస్ట్ చేసిన మహి శర్మ.. వీడియో వైరల్
ఆడవాళ్లు ఎన్ని రకాల డ్రెస్ లు వేసుకున్నా చీరకట్టులోని అందం ఇంకెందులోనూ కనిపించదని మరోసారి రుజువైంది. భారతీయతను చాటే చీరకట్టు జపాన్ వాసులను ఆకట్టుకుంది. మహి శర్మ అనే కంటెంట్ క్రియేటర్ చీరకట్టుకొని జపాన్ వీధుల్లో నడిచి జపనీయుల మది దోచింది. ఆమె హొయలు పోతూ నడుస్తుంటే ఆడ, మగ.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్థానికులంతా నోరెళ్లబెట్టి, కళ్లప్పగించి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహి శర్మ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అది వెంటనే వైరల్ అయింది.

ఆ వీడియోలో మహి శర్మ నీలి రంగుపై తెల్ల చుక్కలతో బంగారు రంగు అంచులున్న చీర ధరించింది. జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న ఓ వీధిలో ఫుట్ పాత్ పై ఆమె నడస్తుంటే మరొకరు వీడియో తీశారు. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులంతా తల తిప్పి ఆమెను ఆశ్చర్యకరంగా చూస్తుండిపోవడం అందులో కనిపించింది. కొందరు జపాన్ మహిళలైతే ఏకంగా మహి శర్మను ఫొటోలు తీసుకున్నారు.  
ఈ వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ మహి శర్మ తన ఆనందాన్ని పంచుకుంది. ‘జపాన్ లో చీరకట్టుకొని నడిచా. అక్కడి వారి స్పందన భలే నవ్వు తెప్పించింది. ఏదో సరదా కోసమని టోక్యో వీధుల్లో చీర కట్టులో తిరుగుదామనుకున్నా. కానీ జపనీయులు నా ఫొటోలు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు. వారు అలా చేయడం చూసి అవాక్కయ్యా’ అని మహి శర్మ తెలిపింది.

ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుంచి 30 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. చాలా మంది నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. భారతీయ వస్ర్తధారణ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుందన్న విషయాన్ని మహి శర్మ మరోసారి నిరూపించిందంటూ కామెంట్లు చేశారు. అయితే కొందరేమో ఆమె ధరించిన జాకెట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. చీరకు తగ్గ జాకెట్ అది కాదని పేర్కొన్నారు. అయితే అసలైన భారతీయ సంస్కృతిలో మహిళలు జాకెట్లు ధరించే వారు కాదని కొందరు గుర్తుచేశారు.
https://www.instagram.com/reel/C68wT-Kp-GO/?utm_source=ig_web_copy_link
Japan
Tokyo
Streets
Indian Woman
Saree
Locals
Enthralled

More Telugu News