Mamata Banerjee: ఇండియా కూటమిలోనే ఉన్నాం... బెంగాల్లో మాత్రమే పొత్తులేదు: మమతా బెనర్జీ

Part Of INDIA Says Mamata Banerjee
  • జాతీయస్థాయిలో ఇండియా కూటమిలోనే ఉన్నామన్న మమతా బెనర్జీ
  • కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఓటు వేయవద్దని పిలుపు
  • ఎన్నికల తర్వాత మమత బీజేపీ వైపు కూడా వెళ్లవచ్చునన్న కాంగ్రెస్ నేత అధిర్ రంజన్

ఇండియా కూటమిలో తమ పార్టీ భాగమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. కూటమి అధికారంలోకి వస్తే తాము బయటి నుంచి మద్దతిస్తామన్నారు. గురువారం హల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... బెంగాల్‌లో మాత్రమే కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో తమకు పొత్తు లేదన్నారు.

కానీ జాతీయస్థాయిలో కూటమిలో ఉన్నామని తెలిపారు. బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మాత్రం పొత్తు ఉంటుందని తెలిపారు. భారత్ కూటమిని స్థాపించిందే తాను అన్నారు. కూటమికి మద్దతిస్తూనే ఉంటానన్నారు.

మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అధిర్ రంజన్ చౌదరి మండిపాటు

కూటమిలోనే ఉన్నామన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి తీవ్రంగా స్పందించారు. మమతపై తమకు నమ్మకం లేదన్నారు. పొత్తు వీడటంతో పాటు ఇండియా కూటమి నుంచి పారిపోయారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఆమె బీజేపీ వైపు కూడా వెళ్లవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.

కేంద్రంలో బీజేపీని గద్దె దించే ప్రయత్నంతో కూటమి ముందుకు సాగుతోందన్నారు. దాదాపు 70 శాతం లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగిన తర్వాత మమతా బెనర్జీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని.. ఇండియా కూటమి గెలుస్తుందని గ్రహించడంతో ఆమె కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు.

  • Loading...

More Telugu News