Janhvi Kapoor: జాన్వీ కపూర్ కు కాబోయే భర్త ఇలా ఉండాలట!

Janhvi Kapoor opens up about qualities in her life partner
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్
  • ఎన్టీఆర్ 'దేవర' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
  • శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్న జాన్వీ
వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' మూవీతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రామ్ చరణ్ సినిమాలో కూడా నటించబోతోంది. త్వరలోనే ఆమె తాజా చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో జాన్వీ బిజీగా ఉంది. నిన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. 

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో జాన్వీకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పగలరా? అని ఆమెను అడిగారు. దీనికి సమాధానంగా... తన కలలను ఆయన కలలుగా భావించేవాడు కావాలని చెప్పింది. తనకు ఎప్పుడూ అండగా నిలవాలని, ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇవ్వాలని, తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని, తాను ఏడ్చినప్పుడు కూడా తన పక్కన ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని తెలిపింది. 

మరోవైపు, తన స్నేహితుడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ లో ఉంది. ఇద్దరూ జంటగా తిరుమలను పలుమార్లు దర్శించుకున్నారు. తమ పెళ్లి కూడా తిరుమలలో, చాలా సింపుల్ గా జరుగుతుందని జాన్వీ తెలిపింది.
Janhvi Kapoor
Bollywood
Tollywood
Husband

More Telugu News