Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI former JD Lakshminarayana opines on Land Titling Act

  • ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాస్పదం
  • అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమైన లక్ష్మీనారాయణ
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యలు పెరుగుతాయని వెల్లడి 

ఏపీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన ఇవాళ అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ చట్టాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఉందని అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు మరింత పెరుగుతాయని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిరసిస్తూ న్యాయవాదులు నిరసన దీక్ష చేశారని, అనకాపల్లిలో న్యాయవాదులు 100 రోజులు దీక్ష చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టం చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

Land Titling Act
VV Lakshminarayana
CBI Former JD
Jai Bharat National Party
Visakhapatnam
  • Loading...

More Telugu News