Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో విషాదం

 Jabardast Star Comedian Kevvu Karthik Mother Expired
  • అనారోగ్యంతో కన్నుమూసిన కెవ్వు కార్తీక్ తల్లి
  • కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం తుదిశ్వాస
  • సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న కమెడియన్

జబర్దస్త్ స్టార్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్ తల్లి అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస వదిలారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దాదాపు ఐదేళ్లుగా తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతోందని, ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నానని కార్తీక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తల్లి మరణించిన విషయాన్ని తన అభిమానులకు వెల్లడించారు. తన తల్లి జీవితమంతా పోరాటమేనని, ఐదేళ్లుగా క్యాన్సర్ తోనూ పోరాడిందని చెప్పారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తమను పెంచిందని చెప్పుకొచ్చారు.

కష్టాల్లో తోడుగా నిలిచిన తల్లి ఇప్పుడు తమను ఒంటరిగా వదిలేసి వెళ్లిందని కార్తీక్ కంటతడి పెట్టారు. కష్టాలు ఎదురైనా భయపడకుండా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న తన తల్లే తనలో ధైర్యాన్ని నింపిందని వివరించారు. సమాజంలో ఎలా బతకాలో నేర్పించింది కానీ తను లేకుండా మేమెలా బతకాలో మాత్రం నేర్పించలేదని ఎమోషనల్ అయ్యారు. తన తల్లిని బతికించేందుకు, ఐదేళ్ల పాటు సేవలందించిన వైద్యులకు ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానని కెవ్వు కార్తీక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News