Crime News: అనంతపురం జిల్లాలో దారుణం.. తల్లిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కుమారుడు

Anantapur man kills mother with iron rod over family feud
  • జిల్లాలోని కంబదూర్ ప్రాంతంలో ఘటన
  • గొడవ పడిన భార్యాభర్తలు
  • కోపంతో తల్లిపై ఇనుపరాడ్డుతో కుమారుడి దాడి
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
కుటుంబ కలహాలతో తల్లినే దారుణంగా హతమార్చాడో కొడుకు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం నిన్న నిందితుడు వడ్డి వెంకటేశ్‌ తల్లి సుంకమ్మ (45).. భర్తతో గొడవ పడింది. ఇద్దరూ ఒకరినొకరు పెద్దగా దూషించుకుంటుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేశ్ ఇనుప రాడ్డుతో తల్లి తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన సుంకమ్మ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన తర్వాత వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
Crime News
Anantapur District
Kambadur

More Telugu News