Sanju Samson: పంజాబ్‌పై సంజూ శాంసన్ కొట్టింది 18 పరుగులే.. కానీ ఐపీఎల్‌లో భారీ రికార్డు

Sanju Samson achieves huge milestone in IPL
  • 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 3 వేల పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా అవతరణ
  • కోహ్లీని అధిగమించి రెండో స్థానానికి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ 
  • అగ్రస్థానంలో కొనసాగుతున్న సురేశ్ రైనా

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్-2024లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో తొలిసారి 500 పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నాడు. కాగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో సంజూ శాంసన్ భారీ ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ చేసింది 18 పరుగులే అయినప్పటికీ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 3 వేల పరుగులు అందుకున్న రెండవ ఆటగాడిగా సంజూ శాంసన్ చరిత్రకెక్కాడు. పంజాబ్‌పై వ్యక్తిగత స్కోరు 10వ పరుగుతో శాంసన్ ఈ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 3వ స్థానం, ఏబీ డివిలియర్స్ 4వ స్థానాల్లో ఉన్నారు. 

ఐపీఎల్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..

1. సురేష్ రైనా - 171 మ్యాచ్‌ల్లో 4,934 పరుగులు (సీఎస్కే, గుజరాత్ లయన్స్)
2. సంజు శాంసన్ - 90 మ్యాచ్‌ల్లో 3,008 పరుగులు (రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్)
3. విరాట్ కోహ్లీ - 93 మ్యాచ్‌ల్లో 2,815 పరుగులు (ఆర్సీబీ)
4. ఏబీ డివిలియర్స్ - 58 మ్యాచ్‌ల్లో 2,188 పరుగులు (ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డేవిల్స్)
5జ మనీష్ పాండే - 72 మ్యాచ్‌ల్లో 1,942 పరుగులు (కోల్‌కతా, డీసీ, ముంబై, ఆర్సీబీ, లక్నో, పుణే వారియర్స్, సన్‌రైజర్స్)

కాగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ టీ20 ప్రపంచ కప్‌కు కూడా ఎంపికైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News