kcr: సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనడం వంచించడమే: కేసీఆర్

KCR fires at revanth reddy government for bonus
  • ఎన్నికల సమయంలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారన్న కేసీఆర్
  • రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని వ్యాఖ్య
  • ఈ విషయం ప్రభుత్వానికి తెలిసీ దొడ్డు వడ్లు పండిస్తే బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతుంది? అని ప్రశ్న
ఎన్నికల సమయంలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం వంచించడమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా దొడ్డు వడ్లు పండిస్తే బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతుంది? అని ప్రశ్నించారు. వరి వేసిన వారందరికీ రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపింది.
kcr

More Telugu News